Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలు జారిపడడంతో ఆసుపత్రి పాలైన ప్రముఖ గాయని ఎస్.జానకి

  • బంధువుల ఇంట్లో కాలుజారి పడిన జానకి
  • తుంటి భాగంలో విరిగిన ఎముక
  • నొప్పితో విలవిల్లాడిన గాయని
దాదాపు అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ తన గానమాధుర్యాన్ని పంచిన ప్రముఖ గాయని ఎస్.జానకి (81) ఆసుపత్రి పాలయ్యారు. ఆమెకు తీవ్ర గాయం కావడంతో మైసూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. బంధువుల ఇంటికి వచ్చిన జానకి కాలుజారి పడిపోయారు. వైద్యపరీక్షల్లో ఆమె తుంటిభాగంలో పగులు కనిపించినట్టు సమాచారం. ఘటన తర్వాత జానకి భరించలేనంత నొప్పితో బాధపడుతుండడంతో బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం జానకి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
Janaki

More Telugu News